ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ బయటికి రావాలని నినాదాలు చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పెన్షన్ రూ.4 వేలు హెచ్చింపు చేస్తూ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.