తాంసీ మండలంలోని గిరిగామలో తొడసం గోపాల్ అనే వ్యక్తి తన ఇంట్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. ఆదివారం టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలిసి గోపాల్ ఇంటి వద్ద 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గోపాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, సిబ్బంది మొహన్, రవిందర్, అరవింద్ జమీర్, శారదా, సతీష్ పాల్గొన్నారు.