తెలంగాణలో గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సోయం బాబురావు తెల్ల వెంకటరావు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిపై రాజ్య ద్రోహం కేసు నమోదు చేయాలి డిమాండ్ చేస్తూ ఈనెల 19న చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ విడుదల చేశారు. శనివారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా లంబాడీ సంఘం అధ్యక్షుడు భూక్యా తిరుపతి నాయక్ హజరై మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అనే తప్పుడు ప్రచారాలను మానుకోవాలన్నారు. లేదంటే మాజీ పార్లమెంట్ సభ్యులు, స్వయం బాబురావు, తెల్ల వెంకటరావ్ లను రోడ్లమీద తిరగనీయ్యమన్నారు.