అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ కావలి ఎమ్మెల్యేని వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు సిద్ధిక్ ప్రశ్నించారు. పుడింగిలాగా మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. స్థాయిని మరిచి మాట్లాడడం సరికాదు అంటూ మండిపడ్డారు.