నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు 1,17,240 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతుందన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు.