మైదుకూరు మండలంలో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పొలం బడి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా వరి నాట్లు వేసి రైతులకు వివరించారు. వరి నార్లు కొనలు తుంచి వరినాట్లు వేసుకోవాలని తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్ బాలగంగాధర్ రెడ్డి, ఏఫ్ పీవో మైదుకూరు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.