ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న పాలుట్ల గ్రామంలో సోలార్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు బిజెపి ఇన్చార్జి నాగేశ్వరరావు తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో భాగంగా గిరిజన ప్రజలకు చీకటిని పారదోలి వెలుగును నింపేందుకు సోలార్ కనెక్షన్లు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోలార్ కు సంబంధించిన పరికరాలను లారీలలో తరలించినట్లు పేర్కొన్నారు.