మధురవాడ కొమ్మాది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నేషనల్ స్పోర్ట్స్ డే సంబరాలు- 2025 శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఛాంపియన్షిప్ కప్ జోన్-1 లెవెల్ క్రీడా పోటీలను భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. ఆగష్టు 29 అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.