మహిళల రక్షణ కోసమే షి టీం పని చేస్తుందని షీటీం జిల్లా ఇన్చార్జి ఎస్సై బిక్కలాల్ అన్నారు. గురువారం అసిఫాబాద్ పిటిజి బాలుర పాఠశాలలో షీ టీం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థినిలను ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే వెంటనే షీ టీం నెంబర్ 8712670564 కు డయల్ చేయాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు పాల్గొన్నారు.