తాడిపత్రిలో ఏపీ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఛైర్మన్ ఈశ్వర్ పర్యటించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎమ్మెల్యేని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.