మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ASF జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకం క్రింద ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కుందారపు రాణికి 10 లక్షల రూపాయలతో మంజూరైన మొబైల్ చేపల విక్రయ వాహనం యూనిట్ ను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.