తిరువూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మద్దిరాల నాగరాజు ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు ఎస్బిఐ సహకారంతో పాతిక లక్షల రూపాయలతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సూచన చేసినట్లు తెలిపారు.