రంగు జాతి కులం లేదా సంపద ఆధారంగా ఎవరిని చిన్నచూపు చూడకూడదని మానవులందరూ సమానమని ప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారని మౌలానా షేక్ బాజీ షాహిద్ తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం పసుమర్లోని చిన్న మసీద్ బజార్లో మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన సుగంధ ద్రవ్యాలతో అలంకరించిన మండపంలో మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను వివరించారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనలు ధూవ చేయడం జరిగింది.