ప్రకాశం జిల్లా గిద్దలూరులో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ చీఫ్ ప్రభాకర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి నీటి సమస్యపై వివరించి చెప్పారు. సాధ్యమైనంత త్వరలో గిద్దలూరు పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.