ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ఆదివారం ఓ ప్యాసింజర్ ఆటో డివైడర్పైకి దూసుకెళ్లింది. కొండపల్లి నుంచి వస్తున్న ఆటో.. వన్వేలో ఆటో స్టాండ్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో డ్రైవర్ మాత్రమే ఉండటం, ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో డివైడర్పైకి వెళ్లిన శబ్దానికి అక్కడున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.