మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని ఎస్సై రాజేష్ శుక్రవారం తెలిపారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల ప్రజలతో పిఎస్ కమిటీ ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు అలాగే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.