శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోన YCP రాష్ట్ర పిలుపుమేరకు సోమవారం నిర్వహించిన ఎరువులు కొరత పై నిర్వహించిన నిరసన, ధర్నా కార్యక్రమంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు తీశారు. జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి బర్తరఫ్ చేయాలని, రైతులకు సకాలంలో ఎరువుల అందించాలని వారంతా నినాదాలు చేశారు. ఎక్కడికి అక్కడ పోలీస్ పికిటింగ్ ఏర్పాటు చేస్తూ జిల్లాకుచెందిన నాయకులు అందర్నీ అరెస్టులు చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు.