శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంటింటికీ తిరిగి పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పింఛన్లను పెంచి పంపిణీ చేస్తోందని చెప్పారు