ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు సోమవారం రోజున ఉదయం 11 గంటలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ మాట్లాడుతూ... జిల్లాలో యూరియా కొరత ఉందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాకు 15-20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే, ఇప్పటికీ 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారని అన్నారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు యూరియా అవసరమైన సమయంలో ప్రభుత్వాలు తేవడం లేదని ఆరోపించారు.