అనంతపురం నగరంలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో ఏబీఎన్ లను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ శనివారం సాయంత్రం పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆయన లాక్ బుక్ ను పరిశీలించి పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.