Araku Valley, Alluri Sitharama Raju | Aug 24, 2025
జి.మాడుగుల మండలంలోని గెమ్మెలి తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని ఎస్.కొత్తూరు నుంచి గెమ్మెలి వరకు 40 ఏళ్ల క్రితం నిర్మించిన తారురోడ్డు కొన్నిచోట్ల గుంతలు ఏర్పడి కురుస్తున్న వర్షాలకు గుంతల్లో వర్షపు నీరు చేరిందన్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు తెలిపారు.అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి గిరిజనుల కష్టాలు తీర్చలని వారు కోరారు.