గోదావరిలో మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మామిడికుదురు మండలంలోని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల్లో రెండు సార్లు వచ్చిన వరదల వల్ల లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద తగ్గుముఖం పట్టి ఉపశమనం పొందుతున్న తరుణంలో భద్రాచలం వద్ద వరద మళ్లీ పెరుగుతోందన్న వార్త వారిని కలవరపెడుతోంది.