ఆదోనిలో 'అన్నదాత పోరు' కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. సకాలంలో రైతులకు యూరియా అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకా పాల్గొన్నారు.