తాళ్ళరేవు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ శ్రామికులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో 15 రోజులలో వేతనాలు ఇవ్వాలనే నియమాన్ని పాటిస్తూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీవో లకు వినతి పత్రాలు అందజేశారు.