ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని పిలిపించి విద్యార్థులపై ఎలాంటి ఫీజు ఒత్తిడి చేయవద్దని తెలిపారు. మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వపరంగా రావాల్సిన ఫీజులు ఏవైనా ఉంటే మంత్రి లోకేష్ బాబు తో కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని వారికి తెలియజేశారు.