ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర మంత్రి పేర్కొన్నారు శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం 2025 కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ ,జిల్లా కలెక్టర్ రాజకుమారి ,డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు