రాయదుర్గం పట్టణంలో జరిగే ఐదవ రోజు గణేష్ నిమజ్జన వేడుకల్లో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ సిఐ జయానాయక్ కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించి ఆ వాహనాల్లో జనాలను తీసుకెళ్లడం చేయరాదన్నారు. నిమజ్జనం, ఊరేగింపులలో చిన్నారుల పట్ల పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిగేందుకు పోలీసు అధికారులతో సహకరించాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తేవాలని విజ్ఞప్తి చేశారు.