అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ సూడిగాలి పర్యటనలో మాట్లాడారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు.