శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి రాత్రివేళ భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి జాతీయ రహదారిపై చోట్ల వర్షపు నీరు నిలీచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.