నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మూసివేశారు. వేద పండితులు జ్వాలా, కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి, ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.