గంపలగూడెం మండలం కేంద్రానికి భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వినగడప తోటమాల గ్రామం కట్టలేరు వాగు ఉధృతవలన 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. తిరువూరు 9.84 సెం.మి గంపలగూడెం 8. 76 సెం.మీ, విస్సన్నపేట 8.44 సెంటీమీటర్లు, ఏ కొండూరు 8.84 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు.