ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం స్థానిక ఈవిఎం గోదాముల వద్దనున్న పలు ప్రభుత్వ భవనాలను శుక్రవారం 3pm జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పరిశీలించారు. డిగ్రీ కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఇక్కడి పాత డ్వామా కార్యాలయ భవనాన్ని, ప్రక్కనే ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు భవనాన్ని, పరిసర ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి వసతులు, గదులు, రవాణా ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు ఈ తనిఖీల్లో డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, నెల్లిమర్ల తాశిల్దార్ శ్రీకాంత్, ఇతర అధికారులు, కళాశాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. .