జిల్లాలో ప్రధాన మంత్రి ఉపాధికల్పనా పధకం(పిఎంఈజిపి)అంశాలపై నిరుద్యోగ యువతలో విస్త్రృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.