తాడిపత్రి మండలం పులి ప్రొద్దుటూరు గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల హాజీవలి (35) బుధవారం అర్ధరాత్రి ఇంటిలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాజీవలి ఐచర్ వాహనం కొనుగోలు కొరకు పరిచయస్తుల వద్ద రూ. 14 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితం పై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.