కేజీబీవీని సందర్శించిన సీనియర్ సివిల్ జెడ్జి కరీంనగర్ జిల్లా శంకరపట్నం కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని కరీంనగర్ సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీస్ సెక్రెటరీ వెంకటేష్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టంలో వారికి కల్పించబడిన హక్కులు, భద్రతను తెలియజేశారు. అనంతరం హాస్టల్ వంటగదిని పరిశీలించి నాణ్యమైన కూరగాయలు, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.