యూరియా కొరత లేదని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎన్ని మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం యూరియా దొరకడం లేదు. డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం తెల్లవారుజామునుండే వందలాది మంది రైతులు యూరియా కోపం క్యూ కట్టారు. అరకొర గా సరఫరా చేయడంతో తమకు దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.