ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో నాయకపోడు కులస్థులను ఎస్టీలుగా గుర్తించాలని కామవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం 4గంటలకు వారు ధర్నా చేశారు. పదేళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా తమ కులాన్ని పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. ప్రస్తుతం తమ కులమే లేకుండా పోయిందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని వారు కోరారు..