గురజాల సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండటం వలన అనుమతి లేని ఎటువంటి ర్యాలీలు ధర్నాలకి డీజే లకి అనుమతి లేదని గురజాల డిఎస్పి జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ గుమి కూడిన చర్యలు ఉంటాయని అన్నారు.చట్టాన్ని ఉల్లంఘించి ర్యాలీలు ధర్నాలు లాంటివి చేస్తే కచ్చితంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.