Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: గుర్ల మండలంలోని బంటుపల్లి జంక్షన్ లో ఆటో బోల్తా, వ్యక్తి మృతి

Vizianagaram, Vizianagaram | Sep 10, 2025
విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని పెద్ద బంటుపల్లి సమీపంలో ఉన్న రేగటి జంక్షన్ వద్ద ఆ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో ప్రయాణిస్తుండగా కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ కొట్టాడు. దీంతో ఆ అదుపుతప్పి బోల్తా పడింది. ముందు కూర్చున్న ఎం తవిటినాయుడు ఆటో కింద ఉండిపోవడంతో మృతి చెందాడు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us