కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీటితో ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద యథావిధిగా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టుకు 3,88,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఓపెన్ చేసి 3,79,822, కుడి కాలువకు 490, ఎడమ కాలువకు 820, పార్లాల్ కాల్వకు 600, భీమా లిప్ట్కు 750 మొత్తం 3,81,773 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.