బోథ్ మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను గురువారం ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.