నల్లగొండ జిల్లా: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించిన అవగాహన కల్పించాలన్నారు.గ్రామాల్లో నిరంతరం శానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని సూచించారు.