కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలంలో శనివారం వివాహిక అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. చింతలపల్లి గ్రామానికి చెందిన గాలి అనూష 25 సం భర్త సాయి గత నెల15వ తారీఖున నుంచి కనబడడం లేదని తండ్రి గాలి ప్రసాద్ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు అయినట్లు కలసపాడు హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు ఎవరికైనా ఆచూకీ తెలిస్తే కలసపాడు ఎస్ఐ తిమోతి సెల్ నెంబర్ 9121100632 గల నెంబర్ను సంప్రదించవలసిందిగా పోలీసులు తెలిపారు.