రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య రంగం నిర్వీర్యం అవుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం గుంటూరు నగరంలోని కొత్తపేటలో గల మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బందెల నాసర్ జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహిళా కన్వీనర్ బాలనవ్యశ్రీ లింగిశెట్టి మాట్లాడారు గత వైసిపి పాలనలో వచ్చిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. పేద దళిత, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎంబిబిఎస్ విద్య చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.