మధిరలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఎంప్లాయిస్ కాలనీకి వెళ్లే రహదారి పక్కన ఉన్న కాలువలో ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం ఎవరిది, మృతికి గల కారణాలు వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.