ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, నంద్యాల కళారాధన సంయుక్త ఆధ్వర్యంలో మాతృభూమికి కళార్చన పోటీలు నంద్యాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థుల కోసం కవిత, సంగీతం, నృత్యం, గానం సహా 75 విభాగాల్లో 14 రోజులపాటు పోటీలు జరుగనున్నాయి. సోమవారం లఘు చలన చిత్ర విశ్లేషణ పోటీ నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల మేధాశక్తి పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.