రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ పేర్కొన్నారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్న ఊరేగింపును కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఊరేగింపుల సమయంలో ఎటువంటి ఇబ్బందులూ శాంతి భద్రతల సమస్యలూ తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.