విజయవాడ నగర శివారు ప్రాంతమైన కండ్రిక ప్రాంతంలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం కండ్రికలో స్థానికులు మాట్లాడుతూ. డ్రైనేజీ కాలువ పారుదల లేక దోమల విపరీతంగా పెరుగుతున్నాయని గత పది రోజులుగా పడిన వర్షాలు కారణంగా దోమలు విపరీతంగా పెరిగే అన్నారు. జ్వరాలు కూడా వస్తున్నాయని అధికారులు స్పందించి దోమలు నియంత్రణ చేపట్టాలని కోరారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రను సంప్రదించగా సమస్య పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు.