సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దిగ్వల్ గ్రామానికి చెందిన చందే ఉష (32) అనే వివాహిత ఈనెల 27న తన ఇద్దరు పిల్లలైనా కార్తీక్ (5) రితిక్(2) అక్షరాలతో కలిసి ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదన్నారు. తన భర్త కిష్టయ్య బంధువుల వద్ద ఇతర చోట్ల వెతికిన ఆచూకీలాభ్యం కాలేదని శుక్రవారం సాయంత్రం వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇంట్లో నుండి వెళ్లినప్పుడు మహిళ బ్లూ కలర్ చీర, బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించి ఉందన్నారు.