గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ ఆకాంక్షించారు.. సిటీ నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్లోని రామ్మూర్తి నగర్లో చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారాయణ కు ఆయా డివిజన్లో పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమం రాత్రి 10 గంటలకు ముగిసింది.